అవమానం తట్టుకోలేక వ్యక్తి సూసైడ్

  • మహబూబాబాద్ జిల్లా మునిగలవీడులో ఘటన

నెల్లికుదురు, వెలుగు: అవమానం తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ చిర్ర రమేశ్​బాబు కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన దేశబోయిన శ్రీశైలం(42), అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు గురువారం ఇంటికి వెళ్లి  గొడవకు దిగారు.

అతడిని బూతులు తిడుతూ చెప్పులతో కొట్టారు. “నువ్వు చావాలి.. లేదంటే మేమే చంపుతం” అంటూ అవమానిస్తూ హెచ్చరించారు. దీంతో  శ్రీశైలం అవమానం తట్టుకోలేక శుక్రవారం పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదుతో నిందితుడు బాలరాజు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.